స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

By :  Vamshi
Update: 2024-08-01 10:16 GMT

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శాసన మండలిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్ దివ్యాంగులను కించపరిచేలా, వారి ఆత్మ స్థైర్యం దెబ్బతినేలా పదే పదే వ్యాఖ్యలు చేశారని జీవన్ రెడ్డి అన్నారు. దివ్యాంగులను అవమానించేలా మాట్లాడిన స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్మితా మొత్తం రిజర్వేషన్ వ్యవస్థనే అవమానించారని, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల విధానాన్ని ఆమె ప్రశ్నించారన్నారు. దివ్యాంగులను కించపరిచేలా మాట్లాడితే చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదో నాకు అర్థం కావడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్మితా పై యాక్షన్ తీసకోవాలని మండలి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తిని పంపాలని కోరారు.

గతంలో స్మితా సభర్వాల్‌ కామెంట్స్‌పై డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతు ఆమె ఓ ఐఏఎస్ మాత్రమేనని.. స్మితా చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధమని భట్టి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని.. స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ఎంతో మంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. స్మితా సబర్వాల్‌కు భట్టి విక్రమార్క మద్దతు తెలపటం అప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజగా దివ్యాంగులను అవమానపరిచిన ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెను అరెస్ట్‌ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్‌రావు డిమాండ్‌ చేశారు. బుధవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లో గల అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు

Tags:    

Similar News