బీజేపీ 8 ఏళ్ల పాలనలో 15 ఒలింపిక్స్‌ పతకాలు : పురందేశ్వరి

ఏపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

By :  Vamshi
Update: 2024-08-11 10:16 GMT

కాంగ్రెస్ పార్టీపై ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. హస్తం పార్టీ అధికారంలో ఉన్న (1952-2012) 60 ఏళ్లలో ఒలింపిక్స్‌లో ఒలిపింక్స్‌లో భారత్‌కు కేవలం 20 పతకాలు మాత్రమే వచ్చాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి (2016-2024) జరిగిన రెండు ఒలిపింక్స్‌లో 15 పతకాలు వచ్చాయన్నారు.

ప్రధాని మోదీ కృషి వల్ల క్రమంగా పతకాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఏపీలో ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురేవయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు.‘ జెండా పండుగ ప్రారంభమైంది. గత మూడు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జెండా పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటిపై జాతీయపతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. 

Tags:    

Similar News