నాలుగు రాష్ట్రాలకు ఇన్‌చార్జిలను నియమించిన బీజేపీ

ఈ ఏడాదిలో వివిధ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆయా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్ లతో పాటు సహా ఇన్‌చార్జిలను నియమించింది.

By :  Raju
Update: 2024-06-17 09:34 GMT

ఈ ఏడాదిలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలోనే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆయా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల బీజేపీ ఇన్‌ఛార్జ్ లతో పాటు సహా ఇన్‌చార్జిలను నియమించింది.




 

మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్ము కశ్మీర్‌లకు ఇన్‌చార్జిలను నియమించింది. మహారాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సహ ఇన్‌చార్జి మరో కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హర్యానా ఇన్‌చార్జి గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సహ ఇన్‌చార్జిగా బిప్లబ్ కుమార్ దేబ్, జార్ఖండ్ ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహ ఇన్‌చార్జిగా అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జమ్ము కశ్మీర్ ఇన్‌చార్జిగా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిలను నియమించింది. 

Tags:    

Similar News