హరీశ్​ రెడ్డి.. మీ అమ్మానాన్నకు మేం అండగా ఉంటాం

బీఆర్​ఎస్​ ఎన్​ఆర్​ఐ నాయకుడి తల్లిదండ్రులపై దాడికి సీఎం రేవంత్ సోదరుడు కొండల్​ రెడ్డి అనుచరుల ప్రయత్నం.. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్

By :  Vamshi
Update: 2024-08-25 05:00 GMT

బీఆర్​ఎస్​ ఎన్​ఆర్​ఐ నాయకుడు హరీశ్​ రెడ్డికి పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ భరోసా ఇచ్చారు. తన తల్లిదండ్రులపై సీఎం సోదరుడు కొండల్ రెడ్డి మనుషులు దాడికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు కేటీఆర్ కు హరీశ్ రెడ్డి మెసేజ్​ పెట్టారు. తాను అమెరికాలో ఉండటంతో తెలంగాణలో ఉన్న తల్లిదండ్రుల భద్రతపై ఆందోళనగా ఉందని పేర్కొన్నారు. దీనికి స్పందించిన కేటీఆర్​ హరీశ్ రెడ్డికి ఫోన్​ చేసి మాట్లాడారు. ఆయన తల్లిదండ్రులను ఏ ఒక్కరు టచ్ చేయకుండా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రయివేటు సెక్యూరిటీ ఏర్పాటు చేయిస్తానని హామీ.. రేవంత్​ రెడ్డి  ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా హరీశ్ రెడ్డి ఎత్తిచూపుతున్నారు. అమెరికా లో కొండల్ రెడ్డి అప్పుల ఎగవేత వ్యవహారాలు ఆయన బయట పెట్టారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొండల్ రెడ్డి తన తల్లిదండ్రులపై దాడికి ప్రయత్నిస్తున్నారని, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని హరీశ్​ పేర్కొన్నారు. తన తల్లిదండ్రులు ఈమేరకు తనకు సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనికి కేటీఆర్​ స్పందించి హరీశ్​ రెడ్డి తల్లిదండ్రులకు భద్రత కల్పించడానికి అవసరమైన చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News